International Film Festival 2024 : దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌లో యానిమ‌ల్‌, జ‌వాన్‌ల‌ హావా..

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ముంబైలో ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో 'దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఎంతో వైభ‌వంగా జరిగింది. ఈ వేడుక‌కు పలువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రై సంద‌డి చేశారు.

బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన యానిమ‌ల్‌, జ‌వాన్ చిత్రాలు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కోసం పోటీ పడ్డాయి. ఈ సినిమాలు గ‌త సంవ‌త్స‌రం ఇండియాన్ బాక్సాఫీసు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇవి రికార్డులు సృష్టించ‌డ‌మే కాకుండా ప‌లు విభాగాల్లో అవార్డుల‌ను కూడా కైవ‌సం చేసుకున్నాయి. యానిమ‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా అవార్డు కూడా అందుకున్నాడు. ఇక‌, ఈ సినిమాలో ఉత్త‌మ విల‌న్‌పాత్ర‌లో పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు బాబీ దేవోల్ కూడా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక, షారూఖ్‌కాన్ న‌టించిన జ‌వాన్ చిత్రానికి కూడా అవార్డుల వ‌ర్షం కురిసింది. ఈ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జవాన్‌ సినిమాకు గాను షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాలో షారూక్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించి మెప్పించింది. ఉత్త‌మ‌న‌టిగా నయనతార కూడా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల‌తో పాటు ప‌లు వెబ్‌సిర‌స్‌లు కూడా అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. టెలివిజ‌న్ సిరిస్ కూడా ప‌లు అవార్డులు గెలుచుకున్నాయి.

International Film Festival 2024 : Animal, Jawanla Hawa at Dada Saheb Phalke Awards..

ఆ జాబితా చూసేద్దాం...

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: నయనతార (జవాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌)- బాబీ దేవోల్‌ (యానిమల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు - వరుణ్‌ జైన్‌
ఉత్తమ నేపథ్య గాయని - శిల్పా రావు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ - యేసుదాసు

వెబ్ సిరీస్ విభాగం
ఉత్తమ వెబ్ సిరీస్ : ఫ‌ర్జీ
క్రిటిక్స్‌ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్‌)

టెలివిజన్‌ విభాగంలో అవార్డులు వ‌రించిన సిరీస్‌..

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ -(ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మేయిన్)
ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మేయిన్)
ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+