రూ. 100 కోట్ల క్లబ్ లోకి 'ఇరుముడి'..! బాక్సాఫీస్ వద్ద రవితేజ వసూళ్ల సునామీ..
మాస్ మహారాజ రవితేజ సినిమాలు కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోవడంతో ఫ్యాన్స్ డిజపాయింట్ తో ఉన్న సంగతి తెలిసిందే. భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, ఈగల్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21 న విడుదలైన 'ఇరుముడి' రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ దక్కింది.
తండ్రీ కూతురు సెంటిమెంట్, డివోషనల్ టచ్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు చలనచిత్ర చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అటు నార్త్ అమెరికాలోనూ ఇరుముడి మూవీ 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇక రవితేజ కెరీర్‌లో ఓ సినిమా నార్త్ అమెరికాలో ఈ స్థాయి మార్క్ ను చేరుకోవడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇరుముడి మూవీకి కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రిలీజ్ అయిన దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని కొన్న వాళ్లకు ప్రతీ ఒక్కరు రూపాయికి 10 రూపాయిల లాభాలు అర్జించినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఏపీలో రూ. 17.5 కోట్లు, తెలంగాణలో రూ. 16.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

అలాగే తమిళనాడులో రూ. కోటి, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలతో 40 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీకెండ్ లోనే కాదు ఈరోజు సోమవారం కూడా ఇరుముడి మూవీకి కళ్లు చెదిరే రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 24 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అప్పట్లో పుష్ప 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు మాత్రమే ఇలాంటి క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఈ మ్యాజిక్ రవితేజ ఇరుముడి సినిమాకు రిపీట్ అవుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications