తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. నెక్స్ట్ మూవీకి ఏకంగా 175 కోట్లు !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప 2 అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే తన తర్వాత చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా.. అది కాస్త లేట్ అవుతుందని అందుకే ఈ లోపు తమిళ్ డైరెక్టర్ అట్లీతో మూవీకి అల్లు అర్జున్ రెడీ అయినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్ లో ఉండగా.. అట్లీ కూడా అక్కడే ఉన్నారని ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథను పక్కాగా సిద్ధం చేసేందుకు ఇరువురూ తీవ్రంగా కృషి చేస్తున్నారని అంటున్నారు. అట్లీ తన మార్క్ స్టైల్‌లో హై-ఎనర్జీ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్లు మూవీకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతోపాటు లాభాల్లో 15% వాటా ఇచ్చేలా 'సన్ పిక్చర్'తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా.. అక్టోబర్ నుంచి మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు అంటున్నారు.
అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనబోతున్నారని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు రెండూ అల్లు అర్జున్ చేయబోతున్నట్టు వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ స్టోరీ సిట్టింగ్స్ కోసం అల్లు అర్జున్, అట్లీ మరో 10 నుంచి 15 రోజుల పాటు దుబాయ్‌లోనే ఉండనున్నారని చెబుతున్నారు. అన్నీ ఒకే అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో












Click it and Unblock the Notifications