మృణాల్ ఠాకూర్ ది చిన్న కథ కాదే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తున్న డేటింగ్ అండ్ రిలేషన్ షిప్. ఇటీవల కాలంలో వీరిద్దరూ పలు ఈవెంట్‌లలో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు, ముఖ్యంగా ఓ బర్త్ డే సెలబ్రేషన్స్ లో తీసిన వీడియో వైరల్‌గా మారింది. దీని తర్వాత ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి.
ధనుష్, మృణాల్ నిజంగానే బాలీవుడ్‌లో కొత్త జంట కాబోతున్నారా? అన్న చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం- ఆగస్టు 1న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుక. ఈ కార్యక్రమానికి ధనుష్ హాజరయ్యాడు. పార్టీలో తీసిన ఓ వీడియోలో ధనుష్, మృణాల్ చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుకోవడం స్పష్టంగా కనిపించింది.

ఈ దృశ్యం ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారి, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే చర్చకు దారి తీసింది. అంతేకాదు, ఇదే రోజు ధనుష్ ముంబైకి ప్రత్యేకంగా విమానంలో రావడం, మృణాల్, అజయ్ దేవగన్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
ఈ స్క్రీనింగ్ సందర్భంగా తీసిన మరో వీడియో కూడా 'ఎక్స్' లో చక్కర్లు కొడుతోంది. అందులో మృణాల్ ధనుష్ చెవిలో ఏదో గుసగుసలాడటం రికార్డయింది. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

"ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారా?" అని ఒకరు ప్రశ్నిస్తే, "ఇంకా నిర్ధారణ కాలేదు.. హింట్స్ కనిపిస్తోన్నాయి.." అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొందరు- "వారు కేవలం స్నేహితులు మాత్రమే అనుకుంటా" అని అభిప్రాయపడ్డారు. "నిజమా? నేను నమ్మలేకపోతున్నాను" అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ధనుష్, మృణాల్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 3న, రచయిత్రి-నిర్మాత కనికా ధిల్లన్ ధనుష్ తదుపరి చిత్రం 'తేరే ఇష్క్ మే' కోసం ఏర్పాటు చేసిన పార్టీలో మృణాల్ కనిపించారు. కనికా షేర్ చేసిన ఫొటోల్లో మృణాల్, ధనుష్ సినిమా యూనిట్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025
ప్రస్తుతానికి ధనుష్ గానీ, మృణాల్ గానీ ఈ పుకార్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా- ధనుష్ గతంలో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ధనుష్ ప్రస్తుతం కృతి సనన్‌తో కలిసి 'తేరే ఇష్క్ మే' చిత్రంలో నటిస్తున్నారు. ఇది నవంబర్ 28న విడుదల కానుంది. మృణాల్ తాజా చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ఆగస్టు 1న విడుదలైంది.
-
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications