కత్రినా ప్రెగ్నెంటా? ఒక్క ఎంట్రీతో రూమర్లకు చెక్ పెట్టిన పొడుగుకాళ్ల సుందరి!
ఒక్క ఎంట్రీతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌పై వస్తోన్న రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టింది. గతకొన్ని రోజులుగా కత్రినా ప్రెగ్నెంట్ అని, ఆమె లండన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుందంటూ వార్తలు చెక్కర్లు కొట్టాయి. అందుకు సంబంధించిన ఆధారాలంటూ అంటూ ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఫ్లాట్ పొట్టతో కెమేరాకు ఫోజిచ్చి తన ప్రెగ్నెన్సీపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి.
కాట్ బ్లాక్ సూట్‌లో..
2021లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కత్రినా కైఫ్ భర్త విక్కీ తన 36వ పుట్టినరోజు మే 16న గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. అందుకోసం గత నెలలో కత్రినా కైఫ్‌తో కలిసి విక్కీ లండన్ విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అక్కడే ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది కత్రినా. దీంతో ఆమె లండన్‌లోనే ఫ్యూచర్ ప్లానింగ్ చేకున్నారని, పలు వెబ్‌సైట్‌లు రాసుకుంటూ వచ్చాయి. తాజాగా లండన్ పర్యటన ముగుంచుకుని కత్రినా జంట శనివారం రాత్రి ముంబైలో అడుగుపెట్టింది. ముంబై ఎయిర్ పోర్టులో కాట్ బ్లాక్ సూట్‌లో ఫొటోలకు పోజులిచ్చిన కత్రినా తనపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టారు. ఈ ఫోటోలు చూస్తే ఆమె గర్భం దాల్చలేదనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

సినీ కెరీర్‌పై దృష్టిపెట్టి..
పెళ్లి తర్వాత కూడా కత్రినా తన సినీ కెరీర్‌పైనే దృష్టిపెట్టింది. గతేడాది టైగర్-3లో నటించిన ఈ అమ్మడు.. ఈ ఏడాది మెర్రీ క్రిస్మస్ సినిమాతో మంచి సెక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తర్వాత మరో సినిమాను ఇంతవరకూ వెల్లడించలేదు. మరోవైపు కత్రినా భర్త విక్కీ కూడా ఛావా, బ్యాడ్ న్యూజ్, లవ్ అండ్ వార్ వంటి పెద్ద ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండడంతో ఈ జంటపై వస్తోన్నవన్నీ రూమర్లేనని తేలిపోయింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications