అతి మంచితనంతో తనను తాను తగ్గించుకుంటున్న ఎన్టీఆర్?

మనిషికి మంచితనం ఉండాలి. అది ఎవరూ కాదనరు. కాకపోతే ఏదైనా శ్రుతిమించితేనే ప్రమాదం. ఎంతవరకు ఏది ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. అలా కాకుండా అతి మంచితనానికి పోతే ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెంపర్ సినిమా నుంచి వరుసగా సూపర్ హిట్ సినిమాలే చేసుకుంటూ వస్తోన్న తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. రాజమౌళి దర్శకుడు. ఈ సినిమా చూసిన తర్వాత తారక్ అభిమానులు తీవ్రంగా నిరాశ పడ్డారు. ఎందుకంటే సినిమాలో ఎన్టీఆర్ సహాయపాత్ర పోషించినట్లుగా కనపడ్డాడేకానీ హీరోగా కనపడలేదు. హీరోగా క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కు వెళ్లిపోయింది.

రాజమౌళి అడిగితే చిన్న హీరో అవ్వాలా?
రాజమౌళి అడిగాడు కదా అని.. రామ్ చరణ్ తన స్నేహితుడు కదా అని అనుకొని సినిమా చేస్తే హిట్ అవ్వొచ్చుకానీ నీకున్న క్రేజ్ సంగతి ఏమిటి? నీ అభిమానుల పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా మిమ్మల్ని జూనియర్ హీరోగా అభిమానులను చూసుకోమంటావా?. ఇప్పుడు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ అడిగింది కదా అని, ఆదిత్య చోప్రా అడిగాడు కదా అని నిన్ను నువ్వు తగ్గించుకొని మళ్లీ అలాంటి పాత్ర వార్ 2లో ఎందుకు చేసినట్లు?.. ప్రీ రిలీజ్ వేడుకలో కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందన్నావు.. మరి ఏం చూసి కాలర్ ఎగరేయాలని సినిమా చూసినవారు ప్రశ్నిస్తున్నారు. తెలుగులో ఎంతోమంది టాలెంట్ డైరెక్టర్లు ఉండగా అయాన్ ముఖర్జీ సినిమాలో చేయాల్సిన అవసరం ఏమిటి?.. వార్ సినిమా చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ను మార్చడమే యష్ రాజ్ ఫిలింస్ చేసిన పెద్ద తప్పు. అప్పటికే పఠాన్ తో షారుక్ కు చాలాకాలం తర్వాత అతి పెద్ద వెయ్యి కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ అందించాడు. డైరెక్టర్ ను మార్చినప్పుడైనా సినిమా నుంచి తప్పుకుంటే బాగుండేదంటున్నారు.

Is NTR diminishing his image and craze with his excessive goodness

ఆ డైరెక్టర్లు ఒక్క కథైనా చెప్పారా?
అతి మంచితనానికి పోయి డైరెక్టర్లు ఫ్లాపుల్లో ఉన్నారుకదా అని సినిమాలు చేశావు.. ఈరోజు వాళ్లు ఒక్కళ్లన్నా నీతో సినిమాలు చేస్తున్నారా? సుకుమార్ నేనొక్కడినే పోయిందని నాన్నకు ప్రేమతో సినిమాకు అవకాశం ఇచ్చావు.. అతను తర్వాత ఒక్క కథైనా నీకు చెప్పాడా? అజ్ఞాతవాసి పోయిందని త్రివిక్రమ్ ను అరవింద సమేతతో నిలబెట్టావు.. ఆ తర్వాత అతను ఏం చేశాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ అవకాశం ఇవ్వలేదని మైథలాజికల్ సినిమాతో నీ ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ చేస్తానంటే నీ దగ్గరకు వచ్చేవాడు కాదు. కొరటాల శివతో దేవర రెండు భాగాలుగా కాకుండా ఒకటే భాగం చేసుంటే ఆ సినిమా కనీసం రూ.1000 కోట్లు వసూలు చేసేది. కానీ దాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. ఏదేశమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తన అతి మంచితనాన్ని వదులుకుంటేనే తాను అనుకున్న స్థాయికి వెళ్లగలుగుతాడని, లేదంటే కష్టమనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+