అన్నపూర్ణ స్టూడియోస్‌లో మహేష్ బాబు: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పేరు అనౌన్స్..!!
Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ ఎవరో అనఫిషియల్‌గా తేలింది. నేడు గ్రాండ్ ఫినాలే ఏర్పాటైన నేపథ్యంలో.. విజేత ఎవరో తేలిపోయింది. బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ శనివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ముగిసింది. ఈ ఎపిసోడ్ ఈ సాయంత్రం ప్రసారం కానుంది.
ఈ గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనే విన్నర్ పేరును ప్రకటించారు. ఆ పేరే- పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth). రైతు బిడ్డ. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా పల్లవి ప్రకాష్ పేరును మహేష్ బాబు ప్రకటించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్.. చివరి వారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందరి కంటే ముందుగా ఈ గ్రాండ్ ఫినాలేలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని టాక్. టఫ్ ఫైట్ ఇచ్చిన అతను ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఏకైక విమెన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ అయిదో స్థానంలో నిలిచారు. అర్జున్ తరువాత ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. చివరి నలుగురిలో ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని ఫైనలిస్ట్ రేసు నుంచి వైదొలిగాడని చెబుతున్నారు. అతను నాలుగో స్థానంలో నిలిచాడట.
పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ టాప్ 3లో మిగిలారు. వారిలో అమర్ దీప్ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. పల్లవి ప్రశాంత్, శివాజీ కంటే తక్కువ ఓట్లను సాధించాడు. చివరి రౌండ్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీ మిగిలారు. వారిలో అత్యధిక ఓట్లను సాధించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

శివాజీ రన్నరప్‍గా నిలిచాడని తెలుస్తోంది. బిగ్‍బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంటోంది. పల్లవి ప్రశాంత్ బిగ్‍బాస్ విన్నర్ అయ్యాడనే అర్థం వచ్చేలా అతని అధికారిక ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ పోస్ట్ షేర్ కావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తోంది.
మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి సైతం మన వెన్నంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టానికి, ప్రయత్నానికి ఫలితం తప్పక లభిస్తుంది. పట్టు వదలకు సోదరా విజయం తప్పక నీదే రా.. అనేది ఈ పోస్ట్ సారాంశం.












Click it and Unblock the Notifications