గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న ఉపాసన (వీడియో)
తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే.
పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు.

దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. క్లీన్ క్లారా పుట్టిన తర్వాత ఓ సందర్భంలో ఉపాసన మాట్లాడుతూ..నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తరువాత తల్లిని అయ్యాను.
ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదు. సెకండ్ చైల్డ్‌ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించింది.అయితే తాజాగా ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యారనే తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి మెగాపవర్ స్టార్ రాంచరణ్‌తో పాటు భార్య ఉపాసన సైతం హాజరయ్యారు.
The Most ROYAL Couple 🦁🔥🤩🤩🤩🤩@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/cE80vvJZOe
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 3, 2025
అయితే ఈ సందర్భంగా ఉపాసన నెమ్మదిగా మెట్లు దిగుతూ కనిపించారు. ఇదే సమయంలో రామ్ చరణ్ సైతం ఉపాసన చేతిని పట్టుకుని మెల్లగా కిందకు దించడం కనిపించింది. ఇక ఉపాసన తన పొట్ట కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించారు.దీంతో ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు జోరందుకున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.మరి ఈ ప్రచారంపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications