వైష్ణవ్ తేజ్ ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడా...ఇందులో వాస్తవమెంతా..?
ఉప్పెన్ సినిమాతో వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ ఓ రెండు సినిమాలు తీసినా అవి పెద్దగా ఆశించిన ఫలితాలు సాధించలేదు. వైష్ణవ్‌తేజ్ ఎవరో కాదు మెగా కుటుంబంలోని సభ్యుడే. స్వయాన నటుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు. ఈ మెగా మేనల్లుడు ఉప్పెన్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో వైష్ణవ్ తేజ్ గురించి సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
ఈ హీరో టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్‌మీడియా కోడైకూస్తోంది. ఈ మధ్యనే మెగా కుటుంబంలో ఓ లవ్ మ్యారేజ్ జరిగింది. అదే వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠిల పెళ్లి. ఇక, మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా లవ్ ట్రాక్‌లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు తెగ మాట్లాడేసుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ ప్రేమలో పడ్డాడంటూ తెగ వార్తలొచ్చేస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది..

రీతూ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీలో మెగా కుటుంబంతో పాటు ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా మెరిసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య సోషల్‌మీడియాలో కూడా ఆమె గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఆమె ఎవరో కాదు.. నటి రీతూ వర్మ. అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీ లో కూడా రీతూ వర్మ హాజరయ్యారు. దీంతో ఆమె గురించి రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ పార్టీలో రీతూ వర్మతో వైష్ణవ్ తేజ్ చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారంటూ తెగ వార్తలొచ్చేసాయి. రీతా వర్మ త్వరలో మెగా ఇంటి కోడలు కాబోతుందని కూడా ప్రచారం కూడా జరిగింది.
అయితే ఈ వార్తలపై మెగా హీరో వైష్ణవ్ తేజ్ కాస్త ఘాటుగానే స్పందించారు. తాను ఎవరినీ ప్రేమించడంలేదని.. వాస్తవాలేంటో తెలుసుకోకుండా ప్రచారాలు చేయడం మంచిది కాదని అన్నారు. రీతూ వర్మ, లావణ్య త్రిపాఠిలు మంచి స్నేహితులని అందుకే పార్టీకి రీతూ వర్మ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆ రిలేషన్‌తోనే పెళ్లి వేడుకల్లో రీతూ సందడి చేసిందని, అంతుకుమించి మరేమీ లేదని వైష్ణవ్ తేజ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications