హోంబలే ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్.. ఇస్కాన్‌ వ్యవస్థాపకులు 'స్వామి ప్రభుపాద' బయోపిక్‌ ఆధారంగా..

హోంబలే ఫిల్మ్స్‌ అనగానే మనకు కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలే గుర్తుకొస్తాయి. అలాగే ఈ చిత్ర నిర్మాణ సంస్థ గతేడాది మహావతార్ నరసింహా అనే భారీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు మరో భారీ యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ. ఈ మేరకు ఏఐ మోషన్ క్యాప్చర్ అనే అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం 'శరణాగతి: ది లైఫ్ ఆఫ్ ఏ సరెండర్డ్ సోల్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌ సెండెంటల్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ISKCON founder Swami Prabhupada the biopic Another huge project from HombaleFilms teaser released

ఈ మూవీలో ISKCON వ్యవస్థాపక ఆచార్యులు ఏ.సీ. భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అలాగే భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పరిచయం చేసిన ప్రభుపాదుల జీవిత విశేషాలను వివరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు ప్రభుపాదుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు టీజర్ చూస్తుంటే స్పష్టం అవుతోంది. ముఖ్యంగా 1965లో తన 69వ ఏట ఆయన భారత్ నుంచి అమెరికాకు పయణమయ్యారు. భగవద్గీత బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రభుపాదుల వారు ప్రారంభించారు.

అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను శరణాగతి మూవీలో పొందుపరచనున్నారు. ఇక ఈ చిత్రానికి గౌర శక్తి దాస రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన టైటిల్ టీజర్‌ ప్రాజెక్ట్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక 2027 ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+