మా అమ్మ , నాన్న విడిపోవడమే మంచిది

లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు. హీరోగా, విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. ఈతరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోలు లేరంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో దశావతారం సినిమాలో 10 పాత్రల్లో కనిపించి చరిత్ర సృష్టించారు.

నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ సేవలు అందించారు. అలాంటి కమల్ హాసన్‌పై నటుడు సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎఫైర్లలో కూడా కమల్ హాసన్ దిట్టానే. పలువురు భామలతో కమల్ హాసన్ ఎఫైర్ సాగించాడు.కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు.వీరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది. కమల్ హాసన్ గారు మొదటి భార్య వాణీ గణపతి. 1978లో వాణితో వివాహం జరిగింది.

It s better for my mother and father to separate - Shruti Haasan

అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లోనే పెళ్లికి ముందే పిల్లల్ని కని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్‌కే దక్కుతుంది. రెండో భార్య సారికతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన కమల్ హాసన్.. పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నారు. శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరూ కమల్ , సారిక రిలేషన్‌లో ఉన్నప్పుడే పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చేసేది లేక 2004లో కమల్‌కు విడాకులిచ్చింది రెండో భార్య సారిక.

తాజాగా తమ అమ్మ నాన్న విడాకులపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించింది. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు కమల్ హాసన్ మరియు సారిక విడిపోయినప్పటికీ, అది తనకు పెద్దగా బాధ కలిగించలేదని ఆమె స్పష్టం చేశారు.కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు, ఒకే ఇంట్లో ఉంటూ, ఇబ్బంది పడుతూ, ఎడమొహం పెడమొహం వేసుకొని విడివిడిగా ఉంటూ కష్టాలు పడడం కంటే విడిపోవడమే బెస్ట్ కదా అని పేర్కొన్నారు.తల్లిదండ్రులు వారిద్దరికీ ఉన్న కారణాల చేత విడిపోయారని, వారి నిర్ణయానికి తాను గౌరవం ఇస్తానని శృతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+