ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్ నటి
ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఓ సర్వేలో తేలింది. ఇందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తాజాగా ఈ జాబితాలో జబర్దస్త్ నటి కూడా చేరింది. ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక సల్కారి తన భర్తకు విడాకులు ఇచ్చినట్టుగా ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక సల్కారి.. తద్వారా వచ్చిన గుర్తింపుతో పలు సీరియల్స్‌లో ఆర్టిస్ట్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఆ మధ్య జబర్దస్త్ షోలో కనిపించి ఫుల్ పాపులారిటి సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తెలుగు సీరియల్స్‌లోనే కాకుండా తమిళ సీరియల్స్ కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. మురుగన్ అనే వ్యక్తిని ప్రియాంక సల్కారి ఎవరికి తెలియకుండా మలేషియాలో పెళ్లి చేసుకుంది. ప్రియాంక పెళ్లి చేసుకుందనే విషయం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టేంత వరకూ ఎవరికి తెలియదంటే ఆమె తన పెళ్లిని ఎంత సీక్రెట్‌గా చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే వీరిద్దరూ విడిపోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ప్రియాంక సల్కారి.. ఓ అభిమాని ''మీ భర్తతో విడిపోయారా'' అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీనికి ప్రియాంక అవునని సమాధానం ఇచ్చింది. అయితే తాము ఎందుకు విడిపోయామో అని ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications