కిర్రాక్ ఆర్పీకి జబర్థస్త్ నటుడు కౌంటర్.. రోజాకు మద్దతుగా కామెంట్స్

జబర్థస్త్ నటుడు రాకింగ్ రాకేష్ నిర్మాతగా మారి తీసిన సినిమా 'కేసీఆర్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శనివారం విడుదలైంది. ఈ సమయంలో రాకింగ్ రాకేష్ మాజీ మంత్రి, జబర్థస్త్ జడ్జ్ రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా అంటే తనకు అభిమానమని రాకేష్ తెలిపారు. నాకు పార్టీలతో సంబంధం లేదని ఈ సందర్భంగా రాకేష్ చెప్పుకొచ్చారు. గడప ముందు వరకే రాజకీయాలని, గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా నాకు ఒకటే అని రాకేష్ చెప్పారు. నాకు కూతురు పుట్టిన తర్వాత మొదట వచ్చింది రోజానే అని గుర్తు చేశారాయన.

నేను ఇబ్బందుల్లో ఉన్నాను..నేను కొందరిని మాత్రమే డబ్బులు అడగగలను, అడగకుండానే నేను తీసుకునే వారిలో రోజా కూడా ఒకరని రాకేష్ తెలిపారు. ఎవరెవ్వరో ఏదో మాట్లాడతారు. రోజా ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఈరోజున ఆమె గురించి మాట్లాడుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేద్దమంటూ రాకేష్ చెప్పుకొచ్చారు. ఇక ప్రీ రిలీజ్‌కు మాజీ మంత్రి రోజా హాజరవుతారని, మీరు ఊహించని వారు కూడా గెస్టులుగా వస్తున్నారని ఈ సందర్భంగా రాకేష్ చెప్పారు. అయితే రాకింగ్ రాకేష్ మాట్లాడింది కిర్రాక్ ఆర్పీ గురించే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Jabardasth actor rakesh comments on roja

రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె చేతుల మీదగానే తన చేపల కర్రీ పాయింట్‌ను ఓపెన్ చేయించాడు ఆర్పీ. ఆ తర్వాత ఆమెపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఆర్పీకి కౌంటర్‌గానే రాకింగ్ రాకేష్ సెటైర్లు వేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జబర్దస్త్ ఆర్టిస్టులందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు.

వీరంతా కూడా మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. కానీ ఒక్క రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలిచారు. అయితే రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్‌ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ కు భయపడిన రాకేష్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజాకు మద్దతుగా మరోసారి రాకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+