ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచిపెట్టిన జబర్దస్త్ నటి
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచియమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్ వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక షోలో యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మీ కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ నటి ప్రెగ్నెన్సీ అయిందనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ నటి మరెవ్వరో కాదు జోర్దార్ సుజాత. ఓ ప్రముఖ వార్త ఛానెల్‌లో వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయింది సుజాత. ఆ తరువాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తద్వారా వచ్చిన గుర్తింపుతో పలు ఈవెంట్స్‌లో సందడి చేసిన సుజాత తరువాత జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చింది. రాకింగ్ రాకేష్ టీమ్‌లో కమెడియన్‌గా సందడి చేస్తూ వచ్చింది.

రాకింగ్ రాకేష్‌తో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో అతన్ని వివాహం చేసుకుంది. సుజాత తల్లి కాబోతుంది. ఇటీవలే ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుటుంబ సభ్యులు సుజాతకు సీమంతపు వేడుకలను జరిపించిన ఫొటోలు బయటకువచ్చాయి. అయితే సుజాత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రహస్యంగా ఉంచింది.
తన ప్రెగ్నెన్సీ ఇలా రహస్యంగా ఉంచడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఇటీవల ముక్కు అవినాష్ భార్య అనూజ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ ఆమె బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ వచ్చేవారు. అయితే కొన్ని కారణాల వల్ల తమ బిడ్డను కడుపులోనే కోల్పోయిన సంగతి తెలిసిందే.ఆ భయం కారణంగానే సుజాత కూడా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలుస్తోంది. సుజాత ఇటీవలే సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్‌తో సందడి చేసింది.












Click it and Unblock the Notifications