రూ.700 కోట్ల స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్‌ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. అలా చాలా కాలం పని చేసిన తర్వాత 'గోరింటాకు' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌ మొదలెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది.

Jabardasth Ritu Choudhary caught in Rs 700 crore land scam

అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే రీతు చౌదరి తాజాగా ఓ స్కాంలో ఇరుకున్నారు. ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది.ఏపీకు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. జగన్ సోదరుడు వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌కు రీతు చౌదరి రెండో భార్య. తాజాగా దీనిపై శ్రీకాంత్‌ స్పందించారు.

తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని ఆమె భర్త తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని ఆయన శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+