వారికి లొంగిపోతేనే ఇక్కడ ఆఫర్లు.. జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

తాజాగా స్టార్ జబర్దస్త్ నటి తాను సైతం లైంగిక వేధింపులకు గురయ్యారనే చెప్పి షాకిచ్చింది. జబర్దస్త్ షోతో రోహిణి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.కెరీర్ స్టార్టింగ్‌లో సీరీయల్స్ నటించిన రోహిణి తన నటనతో , కామెడీ టైమిగ్స్‌తో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ రియాలీటీ షోలో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

jabardasth rohini comments on commitment

ఓ పక్కా పలు షోలు, మరో పక్కా వెబ్ సీరీస్‌లు చేస్తు బిజీ బిజీగా ఉంటుంది. పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.రోహిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో అవకాశాలు కోసం చాలామంది దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా మాట్లాడారని ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగే వారిని రోహిణి తెలిపింది.

తన తండ్రి లాంటి వ్యక్తి కదా అంటూ ఒక అడిషన్‌కి వెళ్ళగా నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని దీంతో అక్కడి నుంచి వచ్చేశానని ఆమె చెప్పుకొచ్చింది. నా కెరీర్‌లో ఇలాంటి ఘనటలు చాలానే ఉన్నాయని, కానీ ఇప్పుడు కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదని రోహిణి తెలిపింది. తన టాలెంట్‌ని నమ్ముకుని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని.. ఈ జీవితం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని.. ప్రస్తుతం తాను జీవితంలో పెద్దగా గోల్స్ అంటూ ఏమి పెట్టుకోలేదంటూ రోహిణి పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+