మీరు పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఏమో నేను కాదు.. జబర్దస్త్ నటుడు దిమ్మతిరిగే కౌంటర్
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. తాజాగా అతను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రాకింగ్ రాకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మాజీ మంత్రి, జబర్థస్త్ జడ్జ్ రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా అంటే తనకు అభిమానమని రాకేష్ తెలిపారు. నాకు పార్టీలతో సంబంధం లేదని ఈ సందర్భంగా రాకేష్ చెప్పుకొచ్చారు. గడప ముందు వరకే రాజకీయాలని, గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా నాకు ఒకటే అని రాకేష్ చెప్పారు. నాకు కూతురు పుట్టిన తర్వాత మొదట వచ్చింది రోజానే అని గుర్తు చేశారాయన. నేను ఇబ్బందుల్లో ఉన్నాను..నేను కొందరిని మాత్రమే డబ్బులు అడగగలను, అడగకుండానే నేను తీసుకునే వారిలో రోజా కూడా ఒకరని రాకేష్ తెలిపారు. ఎవరెవ్వరో ఏదో మాట్లాడతారు. రోజా ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఈ రోజున ఆమె గురించి మాట్లాడుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేద్దమంటూ రాకేష్ చెప్పుకొచ్చారు.

తాను రెగ్యులర్‌గా ఆమెతో ఉంటాను కాబట్టి, తనకు మాత్రమే సాయం చేస్తుందని చాలా మంది అనుకుంటారని, కానీ అది నిజం కాదని రాకేష్ స్పష్టం చేశారు.ఎవరికి సమస్య వచ్చినా సరే, నేనున్నా చూసుకుంటా అంటూ ఎవరినైనా ఆమె అలాగే ఆదుకుంటారని రాకేష్ అన్నారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న రోజా గారి వల్ల లబ్ధి పొంది, ఇప్పుడు ఆమెనే విమర్శించే వారిపై రాకేష్ అసహనం వ్యక్తం చేశారు.రోజాను విమర్శిస్తున్న వ్యక్తి ముఖ్యమైనవాడైతే, తాను కూడా తిరిగి సమాధానం చెప్పేవాడినని, ఆవిడ దగ్గర ఉన్నాం, ఆవిడ దగ్గర తిన్నాం అని చెప్పి ఉండేవాడినని రాకేష్ తెలిపారు. కానీ ఆ వ్యక్తిని తాము పట్టించుకోమని, అలాంటి వేస్ట్ గాళ్ళకి సమాధానం చెప్పడం అనవసరమని అన్నారు.
వాడు మనవాడు అని తాను భావిస్తే, నేనే వెళ్లి అతని కాళ్లు పట్టుకుని, వద్దురా, తప్పురా అని బ్రతిమలాడేవాడినని, కానీ అతని పని అదే అయినప్పుడు ఏమీ చేయలేమని రాకేష్ వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తి డబ్బు కోసం అలా చేస్తున్నాడో లేక ఆరోగ్య సమస్యల వల్ల మాట్లాడుతున్నాడో తెలియదని, అందుకే అతన్ని వదిలేయడమే మంచిదని రాకేష్ అన్నారు. ఈ సందర్భంలో యాంకర్ పవన్ కళ్యాణ్‌ను ప్రస్తావించడం కూడా చర్చనీయాంశమైంది.
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారని యాంకర్ చెప్పగా, "ఆయన అలా అన్నారా?" అని బదులిస్తూ, "అనే ఉంటారులే" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. "మహిళలను కించపరుస్తూ మాట్లాడుతుంటే, ఆయన ఎందుకు స్పందించడం లేదో మీలాంటి జర్నలిస్టులే అడగాలి" అంటూ యాంకర్‌కు కౌంటర్ ఇచ్చారు. మరి రోజాను కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని రాకేష్ నిలదీశారు.రోజాపై జరుగుతున్న బాడీ షేమింగ్‌పై స్పందిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నించారు. యాంకర్ తాను పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానినని చెప్పినప్పుడు, రాకేష్ మీరు ఫ్యాన్ ఏమో, నేను కాదు అని స్పష్టం చేశారు.రోజాకు మద్దతుగా రాకేష్ నిలిచి, పవన్ కళ్యాణ్ మౌనాన్ని ప్రశ్నించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
-
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications