8 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు... ప్రైవేట్ ఐలాండ్ కొన్న హీరోయిన్!
సెలబ్రిటీలు అంటేనే అత్యధిక ఆదాయం కలవారు అనే అర్థం వస్తుంది. సంపాదనకు దూరంగా ఉంటూ సెలబ్రిటీలు అయ్యేవారు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే వారికి డబ్బు ప్రధానం కాదు. సినీ పరిశ్రమలో ఉండే తారలంతా తాము సంపాదించిన డబ్బులను భూములపై పెట్టుబడి పెడుతుంటారు. ఇళ్లను విలాసవంతంగా నిర్మించుకుంటూ అత్యాధునిక సౌకర్యాలను అనుభవిస్తుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా ఓ ప్రైవేట్ ఐలాండ్ ను కొనుగోలు చేసింది. భారతదేశం మొత్తంమీద ఇలా ప్రైవేట్ ఐలాండ్ ఉన్నవారు ముగ్గురే ఉన్నారు.
ప్రియాంక చోప్రా కాదు.. ఐశ్వర్యా రాయ్ కాదు.. అలియాభట్ కాదు.. దీపికా పదుకొనే కాదు.. కత్రినాకైఫ్.. కరీనా కపూర్ అంతకన్నా కాదు.. ఎందుకంటే వీరంతా స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేశారుకానీ ఐలాండ్ ను కొనుగోలు చేయలేదు. ఆమె ఎవరంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎనిమిది సంవత్సరాలుగా ఆమె ఖాతాలో ఓ హిట్ సినిమా కూడా లేదు. అలాడిన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మర్డర్, హౌస్ ఫుల్ 2, రేస్2, కిక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. చివరగా హౌస్ ఫుల్ 3తో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న వెల్ కమ్ టు జంగిల్ చిత్రంలో నటిస్తోంది.

జాక్వెలిన్ సొంత దేశం శ్రీలంక. 2012లో అక్కడ ఓ ప్రైవేట్ ఐలాండ్ ను కొనగోలు చేసింది. అప్పట్లో దాని విలువ చాలా తక్కువ. కేవలం రూ.3 కోట్లకే కొనేసింది. వరుసగా సినిమాలన్నీ హిట్ సాధిస్తున్న సమయంలో దీన్ని కొన్నారు. ఈ ప్రైవేట్ ద్వీపంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాన్ని నిర్మించాలనే యోచనలో ఆమె ఉంది. ఉండటానికి ఇల్లుగా ఉపయోగించుకుందామా? లేదంటే వాణిజ్య సముదాయంగా నిర్మిద్దామా? అనే విషయంపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే ఇలా ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేయడం మంచిదేనని, దీన్ని ఏ అవసరాలకైనా ఉపయోగించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications