'జై హనుమాన్'లో మరో బిగ్ స్టార్.. రాముడి పాత్రలో పాన్ ఇండియా హీరో?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'జై హనుమాన్' గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలోకి మరో బిగ్ స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' చిత్రంలో భల్లాలదేవ రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'హనుమాన్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే మేకర్స్ రానాతో చర్చలు జరిపారని, ఆయన ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మార్చి లేదా ఏప్రిల్‌లో షూటింగ్ షురూ
తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రానా దగ్గుబాటి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ 2026 నుంచి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి హనుమంతుడి అవతారంలో కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రానా ఏ పాత్రలో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. ఈ సినిమాలో రానా రాముడి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు రానా విలన్ పాత్రలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రానా ఏ పాత్రలోనైనా ఇమిడి నటించగల స్టార్ కావడం విశేషం.

ఫిబ్రవరి 22న హంపీలో గ్రాండ్ లాంచ్
ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చారిత్రాత్మక నగరమైన హంపీ వేదికగా ఫిబ్రవరి 22, 2026న ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారతీయ పురాణాలను సూపర్ హీరో కాన్సెప్ట్‌తో జోడించి తన సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన హను-మాన్ చిత్రం దాదాపు రూ.295 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అనంతరం జై హనుమాన్ అనే ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీని తర్వాత భగవంతుడైన ఇంద్రుడి కథతో ఒక సినిమా చేయనున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు.
రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి వంటి ఇద్దరు పవర్‌హౌస్ పెర్ఫార్మర్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో 'జై హనుమాన్'పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మార్చిలో ప్రారంభం కానున్న ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications