అడ్వాన్స్ బుకింగ్‌లో జైలర్ 2 ర్యాంపేజ్.. రిలీజ్‌కు ముందే రజనీ మూవీకి ఎన్ని కోట్లంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమా రికార్డులను తనే బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తుంటాడు రజనీకాంత్. తాజాగా ఆయన నటించిన మూవీ జైలర్ 2. గతంలో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 15న జైలర్ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా రిలీజ్‌కు ముందే వసూళ్ల పరంగా తలైవా సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..
జైలర్ 2లో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజారమూడు, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విద్యా బాలన్, యోగి బాబు, మిర్నా మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, జాకీష్రాఫ్, విజయ్ సేతుపతి వంటి సూపర్‌స్టార్స్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

జైలర్ 2 సినిమాను దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీ క్రేజ్, నెల్సన్ టేకింగ్ దృష్ట్యా ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం జైలర్ 2కి 650 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే జైలర్ 2కు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జైలర్ 2కి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ కింద తమిళనాడులో 8.90 కోట్ల రూపాయలు, కేరళలో 4.25 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1.75 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు చొప్పున భారతదేశంలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్టోబర్ 11 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో జైలర్ 2కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలోని 412 కేంద్రాలలో.. 961 షోలకు గాను 25465 టికెట్లు అమ్ముడై 704382 డాలర్లు (భారత కరెన్సీలో 6.73 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక మిగిలిన దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో 2.1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 20.7 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు మరో 3 రోజులు సమయం ఉండటంతో ఈలోపు జైలర్ 2 ఇంకెంత వసూలు చేస్తుందోనని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications
