గల్ఫ్‌లో జైలర్ 2 ఊచకోత.. విజయ్ రికార్డ్ బ్రేక్, ఫస్ట్ వీకెండ్‌కి ఎన్ని కోట్లంటే?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 400 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసి రజనీ స్టామినా ఏంటో మరోసారి చాటి చెప్పింది. భారత్‌లోనే కాదు ఓవర్సీస్లోనూ జైలర్ 2 ప్రభంజనం ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇక గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలోనూ జైలర్ 2 రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో గతంలో వచ్చిన జైలర్ మూవీకి సీక్వెల్‌గా జైలర్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. జైలర్ 2లో ఎస్జే సూర్య, సూరజ్ వెంజారమూడు, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విద్యా బాలన్, యోగి బాబు, మిర్నా మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, జాకీష్రాఫ్, విజయ్ సేతుపతి వంటి సూపర్‌స్టార్స్ గెస్ట్ రోల్లో తళుక్కున మెరిశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

జైలర్ 2 సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 302 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. జైలర్ 2 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 304 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగినప్పటికీ రజనీ క్రేజ్ ముందు ఆ లక్ష్యం కూడా వణికిపోతోంది. జైలర్ 2కి తొలిరోజున 59.70 కోట్ల రూపాయలు, రెండో రోజున 37.10 కోట్ల రూపాయలు, మూడో రోజున 47.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 55.85 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇండియాలో 200 కోట్ల రూపాయల నెట్.. 234.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో 190 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి 4 రోజుల్లోనే జైలర్ 2 వరల్డ్ వైడ్‌గా 425 కోట్ల రూపాయలు రాబట్టింది.
దసరా సెలవులు, రజనీ ఛరిష్మాతో ఐదో రోజు వరల్డ్ వైడ్‌గా జైలర్ 2 దాదాపు 125 నుంచి 130 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. దాంతో 5 రోజుల్లోనే జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలోనే కాదు.. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఈ సినిమాకు బ్రహ్మారథం పడుతున్నారు. దాంతో కాసుల వర్షం కురుస్తోంది.
ట్రేడ్ వర్గాల లెక్కలను బట్టి చూస్తే గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కలిపి ఫస్ట్ వీకెండ్లో జైలర్ 2కి దాదాపు 6.41 మిలియన్ డాలర్లు (60.80 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇందులో యూఏఈ నుంచి 4.46 మిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 695K డాలర్లు, ఇతర గల్ఫ్ దేశాల నుంచి 1.25 మిలియన్ డాలర్ల చొప్పున రాబట్టాడు రజనీ. తద్వారా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫస్ట్ వీకెండ్లో భారీ వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా జైలర్ 2 నిలిచింది. పఠాన్ (7.93 మిలియన్ డాలర్లు) టాప్ ప్లేస్‌లో ఉండగా తర్వాత జవాన్ (7.42 మిలియన్ డాలర్లు), ఎంపురాన్ (6.59 మిలియన్ డాలర్లు), లియో (6.40 మిలియన్ డాలర్లు), బాహుబలి (5.55 మిలియన్ డాలర్లు) ఉండేవి. ఇప్పుడు బాహుబలి, లియో రికార్డులను జైలర్ 2తో రజనీకాంత్ బద్ధలు కొట్టారు. మరి లాంగ్ రన్లో గల్ఫ్, మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications
