ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్ దిశగా ‘జైలర్2’

75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్‌స్టార్‌కే చెల్లింది. ఆయన తాజా చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మాస్ జోరు సృష్టిస్తోంది. విడుదలై వారం రోజులు పూర్తవుతున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ రన్ కొనసాగించడం సినీ చరిత్రలోనే అరుదైన అద్భుతంగా నిలుస్తోంది.సెలవుల ముగింపు ప్రభావంతో బుధవారం (ఏడో రోజు) కలెక్షన్లలో దాదాపు నూటికి నలభై శాతం మేర స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, రాబట్టిన అంకెలు మాత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.

బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' సునామీ: 3 రోజుల్లోనే ఇన్ని వందల కోట్లా?
బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' సునామీ: 3 రోజుల్లోనే ఇన్ని వందల కోట్లా?

భారతదేశం నెట్ వసూళ్లు: రూ.28.15 కోట్లు, ఇండియా గ్రాస్: రూ.33 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్స్: రూ.7 కోట్లు. ఏడో రోజు వరల్డ్‌వైడ్ మొత్తం: రూ.40 కోట్లు.ఈ కలెక్షన్లతో ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.509 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లెక్కన గురువారం ముగిసేసరికి సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయి, అధికారికంగా బ్రేక్ ఈవెన్ సాధించనుందని సమాచారం.

మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద 'రణబాలి’ రికార్డుల మోత!
మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద 'రణబాలి’ రికార్డుల మోత!
Jailer 2 Rajinikanth Starrer Movie heading towards becoming an all-time industry hit

ప్రాంతాల వారీగా వసూళ్ల హోరు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడు రోజుల ప్రాంతీయ లెక్కలు పరిశీలిస్తే: తమిళనాడు: రూ.143.25 కోట్లు,కర్నాటక: రూ.62.40 కోట్లు, కేరళ: రూ.60.35 కోట్లు, ఉత్తర భారతదేశం: రూ.36.20 కోట్లు (ఏడో రోజు: సుమారు మూడు కోట్లు), టోటల్ ఇండియా: రూ.371. 45 కోట్లు, ఓవర్సీస్ టోటల్: రూ.211 కోట్లు.

ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా...

దాదాపు మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి వారంలోనే ప్రొడక్షన్ కాస్ట్‌ను రాబట్టుకోవడం గమనార్హం. ఇకపై వచ్చే ప్రతీ రూపాయి నిర్మాతలకు నికర లాభంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమా సునాయాసంగా ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా దూసుకుపోతోంది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి వంద నుంచి రెండు వందల కోట్ల వరకు నికర లాభాలు అందించే అవకాశముందని, పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+