తొలి తమిళ చిత్రంగా సంచలన రికార్డు స‌ృష్టించిన ‘జైలర్ 2’

తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త సంచలనం సృష్టించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రూ.723 కోట్ల వసూళ్ల మార్కును దాటిన తొలి తమిళ చిత్రంగా చారిత్రాత్మక ఘనత సాధించింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.723 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఎనిమిదేళ్ల క్రితం రజనీకాంత్ నటించిన '2.ఓ' (రూ.691 కోట్లు) ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.

దీనితో తమిళ చలనచిత్ర రంగాన అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ చిత్రంగా 'జైలర్ 2' నిలిచింది. అంతేకాకుండా, ఈ రూ.700 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 7వ దక్షిణాది చిత్రంగా, భారతదేశం మొత్తం మీద 18వ సినిమాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

'జైలర్ 2’తో సరికొత్త చరిత్ర సృష్టించిన తలైవా రజనీకాంత్
'జైలర్ 2’తో సరికొత్త చరిత్ర సృష్టించిన తలైవా రజనీకాంత్
Jailer 2 sets a sensational record as the first Tamil film to do so

దేశంలో వస్తున్న కలెక్షన్లు

విడుదలైన 11వ రోజు (ఆదివారం) ఒక్క రోజే దేశవ్యాప్తంగా రూ.25.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్ వసూళ్లు రూ.398 కోట్లకు (గ్రాస్ రూ.466.85 కోట్లు) చేరాయి. త్వరలోనే దేశీయంగా రూ.400 కోట్ల నెట్ క్లబ్‌లోకి అడుగుపెట్టనుంది. గతంలో కేవలం 'జైలర్ 1', విజయ్ 'లియో' చిత్రాలు మాత్రమే తమిళనాట ఈ ఘనత సాధించాయి. విదేశీ మార్కెట్‌లోనూ రజనీ హవా కొనసాగుతోంది. 11 రోజుల్లో విదేశాల్లో 25.6 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

రజనీకాంత్ 'జైలర్ 2' పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్
రజనీకాంత్ 'జైలర్ 2' పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ముందున్న లక్ష్యం

ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.44 కోట్ల గ్రాస్ సాధించడంతో, రాబోయే రోజుల్లో ఈ చిత్రం రూ.900 కోట్ల మైలురాయిని కూడా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, రజనీకాంత్ మాస్ మేనియాల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమా స్టామినాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. త్వరలోనే రూ.900 కోట్లకు వెళుతుందని, ఆ తర్వాత తొలిసారిగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినిమా రూ.వెయ్యి కోట్ల గ్రాస్ ను రాబట్టే అవకాశం జైలర్ 2కు ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+