Avatar 3: 'అవతార్ 3.. మీ ఊహకు అందదు... అదో విజువల్ వండర్'

ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టికి నిదర్శనం ఈ మూవీ. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతిని కళ్లకు కట్టే విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. రూ. వందల కోట్లు సాధించి మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2009లో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలై అప్పటివరకూ ఉన్న టైటానిక్ రికార్డులను చెరిపేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్

అవతార్ సినిమాకు వచ్చిన విశేష స్పందనతో ఆ తర్వాత 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌'ను విడుదల చేశారు కామెరూన్. ఈ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. ఈ సీక్వెల్‌ మూవీ బాక్సాఫీసు వద్ద ఓ రేంజ్​లో వసూళ్లు సాధించింది. అండర్ వాటర్ సీక్వెన్స్ లు అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఈ మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

James Cameron Calls Avatar 3 a Visual Wonder Beyond Audience Expectations

'అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌'

'అవతార్' ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానున్నట్లు ఇప్పటికే కామెరూన్ ప్రకటించారు. గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్​ను ప్రకటించారు. 'అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌' పేరుతో రానున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 19న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కామెరూన్ కీలక విషయాలు వెల్లడించారు. "ఈసారి మేము పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతాం. మంచి స్టోరీతో పాటు భారీ విజువల్స్‌తో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్‌-యాక్షన్‌ని ఈ మూడో భాగంలో చూస్తారు. మరో కొత్త ప్రపంచంతో పాటు భిన్నమైన స్టోరీ, అలాగే విభిన్నమైన క్యారెక్టర్లు ఇందులో కనిపిస్తాయి. అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌లో కనిపించిన కేట్‌ విన్స్‌లెట్‌ రోల్​ను ఈ మూడో పార్ట్​లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె ఎంతో శ్రమిస్తోంది.. అని జేమ్స్ కామెరూన్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందా అని మూవీలవర్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అవతార్-4

2029లో 'అవతార్‌ 4', అలాగే చివరిగా రానున్న 'అవతార్‌ 5' 2031 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+