దళపతి విజయ్‌కు బిగ్ షాక్: రిలీజ్‌కు ముందే ‘జన నాయగన్’ లీక్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ విజయ్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'. ఇప్పటికే ఈ సినిమా అనేక వివాదాలు, కోర్టు కేసులు, సెన్సార్ ఇబ్బందులతో సతమతమవుతోంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. అయితే సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే.. కనీసం సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే హెచ్డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం సినిమా బృందాన్న, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
లీక్ అయిన కంటెంట్ వివరాలు
నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 48 నిమిషాల నిడివి గలం హెడ్డీ ప్రింట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ ఇంట్రడక్షన్ సీన్.. ఓ సాంగ్‌తో పాటు మమితా బైజు, దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రముఖులు కనిపించే కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అసలు సినిమా ఇంకా ల్యాబ్‌లోనే ఉండగా.. పక్కా క్వాలిటీతో లీక్ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ కుట్ర ఆరోపణలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో, ఈ లీకేజీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విజయ్ ఫ్యాన్స్, టీవీకే పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా విజయ్‌ను, ఆయన పార్టీని మానసిక దెబ్బ తీయడానికే ఎవరో కావాలనే సినిమాను లీక్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
First 5 minutes of #Jananayagan leaked .
— Honey Bunny (@poondunorukal) April 9, 2026
Anyone who is resharing will be booked and arrested .
Do not share .
Strength to the team !!
Sick behaviour pic.twitter.com/rWkesXN9k4
తమిళ్ రాకర్స్ వింత పోస్ట్
సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ చేసే 'తమిళ్ రాకర్స్' వెబ్‌సైట్, ఈ సినిమా విషయంలో ఓ వింత పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. "సెన్సార్ పూర్తి కాని సినిమాను తాము అప్‌లోడ్ చేయమని, అందుకే దీనిని అందుబాటులో ఉంచడం లేదని" ఆ సైట్ పేరుతో ఉన్న కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా రిలీజ్ కు ముందే సినిమా బయటకు రావడం నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగించే అంశం.
సినిమా విశేషాలు
హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications