మూడో భార్యకు పవన్ కల్యాణ్ విడాకులు?

సినీ రంగంలో ఉండే సెలబ్రిటీలకు ప్రేమించడం ఎంత సాధారణమో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం అనేది కూడా అంతే సాధారణమైన విషయమవుతుంది. తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం వివాహాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. రాజకీయ పార్టీ స్థాపించిన పవన్ పెళ్లిళ్ల గురించి ప్రత్యర్థి పార్టీ నాయకులు తరుచుగా విమర్శలు గుప్పిస్తుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం సరికానప్పటికీ ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి విపరీతమైన చర్చ నడించింది. తాజాగా జనసేన పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ నాయకుడు పోతిన మహేష్ బయటకు వచ్చేశారు. వైసీపీ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పవన్ కల్యాణ్ కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇల్లు తీసుకోవడం సంతోషమని, ఈ పూజకు అన్నా లెజ్నెవాగారితో హాజరుకావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

janasena chief pawan kalyan third wife will get divorce

అయితే గృహప్రవేశం రోజు పవన్ ఒక్కరే పూజ చేశారు. అన్నా లెజ్నెవా రాలేదు. తన మూడో భార్య విడాకులకు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది మొదట్లోనే ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఆమె ఇండియాకు తిరిగిరాలేదు.

పోతిన మహేష్ ముందుగానే హింట్ ఇచ్చాడని, లెజ్నెవాతో కలిసి పూజకు హాజరుకావాలని చెప్పాడని, అంటే దానికిముందే ఈ విషయమై ఆయనకు కొంత సమాచారం ఉందని, దాన్ని పరోక్షంగా అలా చెప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ పవన్ కల్యాణ్ మూడోభార్యకు సంబంధించిన విడాకుల విషయంపై హింట్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+