కండోమ్ యాడ్‌లో స్టార్ హీరోయిన్ కూతురు..ఆమె అయితేనే సీన్ రక్తి కట్టిస్తుందట..!
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ , తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'దేవర-2'తో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కర్ట్ వేసిన ఎందులో అయినా సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కండోమ్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ప్రముఖ మ్యాన్‌ఫోర్స్ కంపెనీకి సంబంధించిన కండోమ్ యాడ్ చేయడానికి జాన్వీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మ్యాన్‌ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా తమ కండోయ్ యాడ్ కోసం జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ తెలిపారు. హీరోల్లో అయితే రణబీర్ కపూర్ బెస్ట్ అని రాజీవ్ జునేజా అన్నారు. దీనిలో భాగంగానే జాన్వీతో ఆ కంపెనీలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ వంటి స్టార్‌తో జతకట్టడం ద్వారా మ్యాన్‌ఫోర్స్ బ్రాండ్‌కు రీచ్ మరింత పెంచవచ్చు. ఆమె గ్లామరస్ ఇమేజ్ బ్రాండ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications