కండోమ్ యాడ్‌కు జాన్వీ కపూర్ బెస్ట్..షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌పై మ్యాన్‌ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మ్యాన్‌ఫోర్స్ కండోమ్ కంపెనీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా తమ కండోయ్ యాడ్ కోసం జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ తెలిపారు. హీరోల్లో అయితే రణబీర్ కపూర్ బెస్ట్ అని రాజీవ్ జునేజా అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.జాన్వీ కపూర్‌పై రాజీవ్ జునేజా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు.ఆమె అనుమతి లేకుండా ఇలా కండోమ్ యాడ్ గురించి మాట్లాడుతూ జాన్వీ పేరు తీయడం తప్పంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై జాన్వీ కపూర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే..
జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన జాన్వీ కపూర్ , తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'దేవర-2'తో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. గా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.












Click it and Unblock the Notifications