సూర్య సినిమాలో హీరోయిన్‌గా జాన్వీకపూర్...
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్‌లో కూడా ఆమె ఎన్‌టిఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'కర్ణ'.
ఈ సినిమా మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఇప్పుడు ఈ సినిమాలో సూర్యకు జోడిగా జాన్వీకపూర్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక, ఇప్పడు ఈ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను కాంటాక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె కూడా ఒకే చెప్పినట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోన్న టాక్.
అయితే, ఈ విషయంపై అటు కర్ణ చిత్ర బృందం గానీ జాన్వీకపూర్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోగా ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను సంప్రదించారు. కానీ, కొన్నిఅనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ స్థానంలో తమిళ స్టార్ హీరో సూర్యను భర్తీ చేశారు.
పలు సినిమాలతో బిజిగి ఉన్న సూర్య...
తమిళ హీరో సూర్య తాజాగా 'కంగువ' సినిమా షూటింగ్ పూర్తిచేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇప్పటి వరకు నిర్మించిన తమిళ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిదేగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీ తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదే కాకుండా మరో సినిమా కూడా సూర్య చేతిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications