క్లిక్స్ కోసం ఇంత నీచమా?: సోదరుడి కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్!

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్‌పై బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా తన సోదరుడు అర్జున్ కపూర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వేధింపులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజమేనని.. కానీ ఆ విమర్శలు వేధింపులుగా మారడం, టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. "విమర్శలు చేయడం అనేది పబ్లిక్ లైఫ్‌లో భాగమే, కానీ వ్యక్తిగత వేధింపులను ఏ రకంగానూ సమర్థించలేం" అని జాన్వీ కపూర్ తేల్చి చెప్పారు.

క్లిక్స్ కోసమే ఇలాంటి పనులు
ప్రస్తుత సోషల్ మీడియా సంస్కృతి గురించి జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆన్‌లైన్‌లో అటెన్షన్ పొందడం కోసం, క్లిక్స్, ఎంగేజ్‌మెంట్ పెంచుకోవడం కోసం కావాలనే "రేజ్ బైట్" వంటి పద్ధతులను వాడుతున్నారని జాన్వీ అభిప్రాయపడ్డారు. అంటే ఎవరినైనా కించపరిచేలా మాట్లాడి లేదా వారిని ట్రోల్ చేసి ఆ వీడియోలకు లేదా పోస్టులకు వ్యూస్ పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారిందని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Janhvi Kapoor Slams Online Trolls Over Brother Arjun Kapoor Says Enough is Enough No Excuses

మనుషులనే విషయాన్ని మర్చిపోతున్నారు..
సోషల్ మీడియా చర్చల్లో వ్యక్తులను కేవలం ఒక "ట్రెండింగ్ టాపిక్"గా మాత్రమే చూస్తున్నారని.. ఆ పేర్ల వెనుక నిజమైన వ్యక్తులు ఉంటారని, వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారని జాన్వీ అన్నారు. ఇలాంటి నెగిటివిటీని తాను వ్యక్తిగతంగా తీసుకోకపోయినప్పటికీ, వేధింపులను సాధారణీకరించడం ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.

చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీ..
వరుస సినిమాలతో జాన్వీ కపూర్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె 'పరమ్ సుందరి', 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి' చిత్రాల్లో మెరిశారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'పెద్ది' లో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ఇవే కాకుండా టైగర్ ష్రాఫ్ సరసన 'లగ్ జా గలే', వరుణ్ ధావన్‌తో 'మిస్టర్ లేలే', థ్రిల్లర్ మూవీ 'హెలెన్' రీమేక్‌లో కూడా జాన్వీ నటిస్తున్నారు. 2026 ఏడాదిలో ఆమె నటిస్తున్న పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+