Srinivasa Mangapuram First Review: మహేష్ అన్న కొడుకు హిట్ కొట్టాడా..?
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో జయ కృష్ణ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడే జయ కృష్ణ. ఆయన హీరోగా నటించిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. జయకృష్ణ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అటు ఘట్టమనేని ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో విపరీతమైన అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.
'శ్రీనివాస మంగాపురం' సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. ఈ బ్యానర్ లో యువ హీరో జయకృష్ణ ఆరంగేట్రం కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఎందుకంటే ఈ బ్యానర్ లోనే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత టాప్ స్టార్స్ గా ఎదిగారు. ఇక 'శ్రీనివాస మంగాపురం' మూవీ జూలై 30 న విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా ఉంది. కథ విషయానికి వస్తే శ్రీనివాస మంగాపురం లో ఉండే జయ కృష్ణ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమ వల్ల అక్కడ లోకల్ గా ఉండే కొంతమందితో గొడవలు జరుగుతాయి. దానివల్ల జయకృష్ణ వాళ్ల నుంచి ఎలా తప్పించుకున్నాడు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.

మూవీలో జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే విధంగా ఉందని టాక్.. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశాడని అంటున్నారు. హీరోయిన్ రషా తడానీ గ్లామర్ ఈ మూవీకి మేజర్ ప్లస్. అలాగే మోహన్ బాబు రోల్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అజయ్ భూపతి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ట్విస్ట్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక 'శ్రీనివాస మంగాపురం' ఫుల్ రివ్యూ కోసం జూలై 30 వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications