భార్యకు విడాకులిచ్చి పది రోజులు కూడా కాలేదు...అప్పుడే మరో అమ్మాయితో స్టార్ హీరో
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
ఇటీవల తమిళ స్టార్ హీరో జయం రవి సైతం తన భార్యకు విడాకులిచ్చారు.ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ జంట తాము విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు.

విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకుని పది రోజులు కూడా కాకుండానే జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు. జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అసలు ఆమెకు, జయం రవికి ఎలా పరిచయం ఏర్పడిందనేది చూస్తే, కేనిషా ఫ్రాన్సిస్ సింగర్. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి పాపులర్ అయ్యింది.
బెంగుళూరుకి చెందిన కేనిషా గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతుంది. తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బమ్‌లోనూ ఆమె పాటలు పాడింది. అడపాదడపా సినిమాల్లో పాడటంతోపాటు సోలో ఆల్బమ్స్‌తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.జయం రవి తన సినిమాల షూటింగ్‌లు లేని టైమ్‌లో కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్తుండేవాడు. అక్కడ పబ్‌కి వెళ్లినప్పుడు కేనిషా పరిచయం అయ్యిందట. ఈ పరిచియం ప్రేమగా మారడంతోనే జయం రవి తన భార్యకు విడాకులిచ్చారని తెలుస్తోంది.త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారట.












Click it and Unblock the Notifications