గద్దర్ అవార్డుల జ్యురీ ఛైర్మన్‌గా జయసుధ, రెస్పాన్స్ అదుర్స్!

తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నటి జయసుధ (Jayasudha)ను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఏప్రిల్ 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది.

జయసుధ, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌లతో బుధవారం సమావేశమయ్యారు ఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా జయసుధ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు.

Jayasudha selected as chairman of the jury for Gaddar Awards

ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరిలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు దిల్ రాజు తెలిపారు.

14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్‌ను ఇస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదని చెప్పారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరిని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ అవార్డ్స్‌కు అన్ని కేటగిరీ లకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ గద్దర్ అవార్డులకు గాను వివిధ క్యాటగిరిల ఎంట్రీలకు గాను వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+