ఓ నేను అండర్‌వేర్ వేసుకున్నా.. స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే ఊడిపోయిన డ్రెస్ !

హాలీవుడ్‌ సూపర్‌స్టార్, గ్లోబల్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్, స్టైల్, డ్యాన్స్.. ఇలా అన్ని విషయాల్లో తనకు తానే పోటీ అనేలా ఉండే ఈ ముద్దుగుమ్మ .. రీసెంట్ గానే తన 56వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ లోని వార్సాలో 'అప్ ఆల్ నైట్: లైవ్ ఇన్ 2025' అనే కాన్సర్ట్ నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్ లో ఊహించని విధంగా చోటు చేసుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది. జెన్నిఫర్ వేసుకున్న మినీ స్కర్ట్ ఊడి పోయి.. అండర్‌వేర్ తో నిలబడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

jennifer-lopej-wardrobe-movement-video-goes-viral-on-media

బట్టలు జారిపోయినా.. షో ఆపకుండా..!

అయితే షో జరుగుతుండగా జెన్నిఫర్ లోపెజ్.. పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం "Happy Birthday, J.Lo" అని ఆమెతో పాటు పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. జెన్నిఫర్ వేసుకున్న గోల్డెన్ కలర్ మినీ స్కర్ట్ అందరూ చూస్తుండగానే స్టేజ్ మీద పడిపోయింది. దాంతో ఆమె లోపల వేసుకున్న గోల్డ్ కలర్ అండర్‌వేర్ కనిపించింది. అయితే జెన్నిఫర్ ఒకింత షాక్ అయినప్పటికీ.. చాలా తెలివిగా, నవ్వుతూ పరిస్థితిని చక్కబెట్టింది.

"అయ్యో.. నేను అండర్‌వేర్ వేసుకున్నా..

ఆ అనుకోని పరిస్థితిలో జెన్నిఫర్ ఏమాత్రం తటపటాయించకుండా.. "అయ్యో.. నేను అండర్‌వేర్ వేసుకున్నాను. నిజానికి మామూలుగా వేసుకోను కూడా!" అంటూ సరదాగా మాట్లాడి కవర్ చేశారు. ఆ తర్వాత ఆమె వెనుక ఉన్న డ్యాన్సర్ స్కర్ట్ సరిచేయడానికి ప్రయత్నించినా.. అది కుదరలేదు. దాంతో జెన్నిఫర్ ఇంకేమీ ఆలోచించకుండా, ఆ స్కర్ట్‌ను తీసుకొని అభిమానుల వైపు విసిరేసింది. "నాకొద్దు... మీరే ఉంచుకోండి!" అంటూ తన పర్ఫార్మెన్స్‌ను కొనసాగించింది. దీంతో ఆమె ధైర్యానికి ప్రేక్షకులు సైతం నిలబడి చప్పట్లు కొట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో "JLo wardrobe moment" ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు ఆమె ప్రొఫెషనలిజం, కామెడీ, ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+