నాలుగో భర్తకు ప్రముఖ నటి విడాకులు..?

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.

తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్‌ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్‌ బై చెప్పనున్నట్లు హాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్‌ తీసుకోబోతున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

Jennifer Lopez-Ben Affleck getting divorce

ఇప్పటికే జెన్నిఫర్‌ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. తాజాగా తమ బంధానికి ఈ జంట ఎండ్ కార్డ్ వేయడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. 2021లో డేటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. బెన్ అఫ్లెక్ - లోపెజ్ చివరిసారిగా మార్చి 30న కలిసి కనిపించారు. ఆ త‌ర్వాత‌ వేసవిని విడిగా గడిపారు. దీంతో వీరి విడాకులు ఖాయమని అంతా భావిస్తున్నారు.ఈ జంట‌ నెల క్రితమే విడాకుల పత్రాలను ఖరారు చేశారు.. కానీ దానిని ప్రకటించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+