పాలలో నిద్రమాత్రలు.. ప్రియుడితో కిలాడీ భార్య రాసలీలలు! పెళ్లయిన నెలన్నరకే భర్తకు నరకం!
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా చిర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. పెళ్లయి కేవలం నెలన్నర కూడా కాకముందే ఓ భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం నడుపుతూ నరకం చూపించింది. ప్రతిరోజూ భర్తకు ఇచ్చే పాలు, టీలలో నిద్రమాత్రలు కలిపి ఇస్తూ అతడు మైకంలోకి వెళ్లిన అనంతరం తన ప్రియుడితో రాసలీలలు సాగించేదని బాధిత భర్త ఆరోపించాడు. చివరికి ఈ విషయాన్ని గ్రహించిన భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆమె అసలు రూపం బయటపడింది.
బాధిత భర్త వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 24న మధ్యప్రదేశ్‌లోని భాండర్ కు చెందిన మహిళతో హిందూ సంప్రదాయాల ప్రకారం అతనికి వివాహమైంది. అయితే పెళ్లయిన నాటి నుంచే ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ప్రతిరోజూ రాత్రి వేళల్లో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అతడు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో మాట్లాడటం .. అతడిని ఇంటికి పిలిపించుకోవడం పరిపాటిగా మారింది. అనుమానం వచ్చిన భర్త ఆగస్టు 23న తన భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

తాము దొరికిపోయామని గ్రహించిన నిందితులు తీవ్ర ఆగ్రహంతో భర్తపైనే ప్రాణాంతక దాడికి ఒడిగట్టారు. భార్య అతడి చేతులను గట్టిగా పట్టుకోగా.. ప్రియుడు అతడి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి అరుపులు విని ఇరుగుపొరుగు వారు సమయానికి అక్కడికి చేరుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. తన ప్రాణానికి భార్య, ఆమె ప్రియుడి నుంచి తీవ్ర ముప్పు ఉందని పేర్కొంటూ బాధితుడు తన తల్లిదండ్రులతో కలిసి ఝూన్సీ ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.














Click it and Unblock the Notifications