ఒక్కరోజే 10 పతకాలు.. 6 స్వర్ణాలతో భారత్ సంచలనం!

Asian Games 2026: ఐచి-నగోయా ఆసియా క్రీడలు 2026లో 13వ రోజు శుక్రవారం భారత్‌కు బంగారు శోభను తీసుకొచ్చింది. వివిధ క్రీడా విభాగాల్లో భారత అథ్లెట్లు అసాధారణ ప్రదర్శనతో విరుచుకుపడి 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 10 పతకాలను భారత్ ఖాతాలో వేశారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం స్వర్ణ పతకాల సంఖ్య 16కు చేరింది. హాకీ, బాక్సింగ్, ఆర్చరీ, కుస్తీ(రెజ్లింగ్) క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను చాటారు.

Asian Games 2026: 44 ఏళ్ల నిరీక్షణకు తెర..భారత్‌కు గోల్డెన్ విక్టరీ!
Asian Games 2026: 44 ఏళ్ల నిరీక్షణకు తెర..భారత్‌కు గోల్డెన్ విక్టరీ!

ఆర్చరీలో చారిత్రాత్మక తొలి స్వర్ణం
భారత్‌కు పతకాల పండగ ఆర్చరీతో ప్రారంభమైంది. మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో అంకితా భకత్, కీర్తి శర్మ, 17 ఏళ్ల కుమ్‌కుమ్ మోహోడ్‌లతో కూడిన భారత త్రయం 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను 5-3 తేడాతో ఓడించి ఆసియా గేమ్స్ ఆర్చరీ చరిత్రలోనే తొలిసారిగా గోల్డ్ మెడల్ సాధించింది. తీవ్రమైన ఈదురు గాలుల ఒత్తిడిని అధిగమించి భారత ఆర్చర్లు ఈ ఘనత సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్ 5-1తో చైనాను ఓడించగా.. మిక్స్‌డ్ రికర్వ్ విభాగంలో కుమ్‌కుమ్-ధీరజ్ బొమ్మదేవర జంట రజత పతకాన్ని గెలుచుకుంది.

Asian Games 2026 Day 13 India Wins 10 Medals in a Day Including 6 Historic Gold Medals Full Details

బాక్సింగ్‌లో మూడు స్వర్ణాల రికార్డు పంచ్
బాక్సింగ్‌లో భారత బాక్సర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. 75 కేజీల ఫైనల్లో స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ 5-0తో చైనాకు చెందిన జియీ బాఓను చిత్తు చేసిన తన పుట్టినరోజున బంగారు పతకాన్ని బహుమతిగా పొందింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. అలాగే 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా 3-2తో చైనీస్ తైపీకి చెందిన నియెన్-చిన్ చెన్ ను ఓడించి స్వర్ణం గెలిచింది. పురుషుల విభాగంలో అంకుష్ పంఘల్ కూడా స్వర్ణం సాధించడంతో ఒక్కరోజే బాక్సింగ్‌లో భారత్‌కు మూడు గోల్డ్ మెడల్స్ దక్కాయి.

ట్రోఫీ ఇచ్చే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరు.. ముందే ప్యాకప్ చెప్పేసిన పీసీబీ బాస్!
ట్రోఫీ ఇచ్చే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరు.. ముందే ప్యాకప్ చెప్పేసిన పీసీబీ బాస్!

రెజ్లింగ్‌లో సుజీత్ అద్భుత తిరుగుబాటు
రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్ అద్భుతంగా పోరాడాడు. 65 కేజీల ఫ్రీ స్టైల్ ఫైనల్లో తజికిస్తాన్‌కు చెందిన అబ్దుల్మజీద్ కుడీవ్‌తో జరిగిన పోరులో ఒక దశలో సుజీత్ 2-9 తేడాకో వెనుకబడ్డాడు. కానీ ఒత్తిడిలోనూ నిలకడ కోల్పోకుండా వరుసగా 8 పాయింట్లు సాధించి 10-9తో సంచలన విజయాన్ని నమోదు చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. అంతకు ముందు సెమీఫైనల్లో ఆయన జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ కొటారో కియోకాను ఓడించడం విశేషం.

44 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ మహిళల హాకీ విజయం
రోజుకు ముగింపుగా భారత మహిళల హాకీ జట్టు మరపురాని ఘనత సాధించింది. గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ రజత విజేత చైనాను 1-0 తేడాతో ఓడించి 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆసియా క్రీడల స్వర్ణాన్ని గెలుచుకుంది. భారత్ తరఫున లాల్‌రెమ్సియామి నిర్ణయాత్మక గోల్ సాధించగా.. గోల్ కీపర్ సవిత పునియా చైనా పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకుని విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+