మెగా హీరోలు దూరం పెట్టినా..ఆ హీరో పిలిచి మరీ జానీ మాస్టర్‌కు అవకాశం ఇచ్చాడే..!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.బాధితురాలు మైనర్‌గా ఉన్నపుడు నుంచే ఆమెపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో పలు సెక్షన్లతో పాటు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజులు జైల్లో ఉన్న ఆయన మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆయన్ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇతన్ని శాశ్వతంగా తొలగించారు.డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు జానీ మాస్టర్ అధ్యక్షుడుగా ఉన్నారు. లేడీ కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్ళి వచ్చారు. దీంతో ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ తెర మీదకు తీసుకువచ్చారు. ఆయన స్థానానికి జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడుగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా అండగా నిలిచినట్టుగా కనిపించలేదు. స్టార్ హీరోలెవ్వరూ కూడా జానీ మాస్టర్ వైపు కన్నెత్తి చూడటం లేదు.

Johnny is the star hero who supports the master

మెగా హీరోలు సైతం జానీ మాస్టర్‌‌కు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఓ స్టార్ హీరో పిలిచి మరి జానీ మాస్టర్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఆ స్టార్ హీరో తెలుగు వ్యక్తి కాదు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త సినిమాలో జానీ మాస్టర్‌కు అవకాశం కల్పించారు. తాను నటిస్తోన్న బేబీ జాన్ సినిమాలో జానీ మాస్టర్‌‌కు ఓ సాంగ్ చేసే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే జానీ మాస్టర్ ఓ సాంగ్‌కు కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ టాలెంట్ చూసిన వరుణ్ ధావన్ , రెండో సాంగ్‌కు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+