అడ్డంగా బుక్ అయిన జానీ మాస్టర్..అసిస్టెంట్‌పై లైంగిక దాడి చేసినట్టు గుర్తింపు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.తాజాగా జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
జానీ మాస్టర్‌పై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి..లైంగిక దాడులకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా అస్టిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎఫ్ఐఆర్లో ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం... 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.అంతేకాకుండా అత్యాచారం కూడా చేశాడని, గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపింది.
జానీ మాస్టర్ దగ్గర జాయిన్ మొదటి రోజు నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆ యువతి తెలిపింది. ప్రతీసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని.. షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలవంతం చేశాడని తన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. నేను నో చెప్పేసరికి నా తలను అద్దంకేసి కొట్టాడు.
మణికొండలోని నా ఫ్లాట్‌కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్‌కు లొంగలేదని ఆమె తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని.. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి అరెస్ట్ చేశారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications