ఘనంగా మ్యాడ్ హీరో 'నార్నే నితిన్' వివాహం.. సందడి చేసిన ఎన్టీఆర్ !!
టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది "నార్నే నితిన్" ఓ ఇంటి వాడయ్యారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి రిసార్టులో నితిన్ - శివాని వివాహం శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరై జంటను ఆశీర్వదించారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. బావమరిది పెళ్లి కావడంతో తారక్ స్వయంగా అతిథులను ఆహ్వానించడమే కాకుండా.. వివాహ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తారక్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. స్లిమ్ పర్సనాలిటీ, గుబురు గడ్డంతో ఉన్న లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నితిన్ - శివాని ఎవరంటే..
నార్నే నితిన్ ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు, మాలతీ దంపతుల కుమారుడు కాగా.. వధువు శివాని తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె. శివాని దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి సన్నిహిత బంధువని సమాచారం. ఈ వేడుకలో వధువు శివాని ఎరుపు-బంగారు రంగుల పట్టు చీరలో మెరవగా.. వరుడు నితిన్ లైట్ పింక్ షేర్వాణీలో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
చిత్ర పరిశ్రమలో నార్నే నితిన్ ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీ శ్రీ శ్రీ రాజా వారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కానీ.. ఆ సినిమా కంటే ముందు విడుదలైన "మ్యాడ్" చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రంతోనే నితిన్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన మ్యాడ్ స్క్వేర్, ఆయ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Annayya - Vadina ♥️🤩
— AndhraNTRFC (@AndhraNTRFC) October 11, 2025
A beautiful pair #JrNTR - #Pranathi @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/0BZEgBB4rS
#GodOfMasses #NTR pic.twitter.com/OJY5clIWgU
— UANowMemes (@UANowMemes) October 11, 2025
మరోవైపు ఎన్టీఆర్ ఈ ఏడాదిలో "దేవర" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేసిన 'వార్ 2'లో కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, "డ్రాగన్" అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications