గ్లోబల్ ప్రాజెక్ట్‌తో గ్లోబల్ స్టార్ కొడుకు ఎంట్రీ.. రోల్ మామూలుగా లేదుగా!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశానికి ఉన్న క్రేజ్, చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని బాలకృష్ణ, హరికృష్ణ.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఇప్పుడు ఈ నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాలుగో తరం కూడా సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త జోరుగా ప్రచారం అవుతోంది.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ రామ్ త్వరలోనే వెండితెరపై బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అడ్వెంచర్ సినిమాలో భార్గవ్ రామ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో భార్గవ్ రామ్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై నందమూరి కుటుంబం నుంచి కానీ, లేదా చిత్ర యూనిట్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ చిత్రంలో భార్గవ రామ్ పాత్ర కేవలం ఓ చిన్న క్యామియో మాత్రమే కాదని.. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోల్ అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే విధంగా అతని క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఇక్కడ విశేషమేమిటంటే.. తండ్రి జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్‌ను బాలనటుడిగానే ప్రారంభించారు. చిన్నతనంలో ఆయన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'బాల రామాయణం' సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 'బాల రామాయణం' చిత్రంలో భరతుడి పాత్రలో, రాముడి పాత్రలో ఎన్టీఆర్ చూపించిన నటన, పలికిన డైలాగులు అప్పట్లో అందరినీ అబ్బురపరిచాయి.
ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తూ చిన్న కొడుకు భార్గవ్ రామ్ కూడా వెండితెరకు పరిచయం కానుండటంతో నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు (అభయ్ రామ్, భార్గవ్ రామ్) అచ్చం తండ్రి పోలికలతో, తారక్‌కు కార్బన్ కాపీలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్‌తోనే భార్గవ్ రామ్ ఎంట్రీ ఇస్తే.. అది నందమూరి అభిమానులకు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పాలి.












Click it and Unblock the Notifications