బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ కేసులో హేమకు జూన్ 14 వరకు రిమాండ్
బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమకు జూన్ 14 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు సమాచారం. కాగా, ఇటీవల (మే 19) బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందనే విషయం తెలుసుకుని వెళ్లి దాన్ని భగ్నం చేశారు పోలీసులు. ఆ సమయంలో నటి హేమ కూడా అక్కడే ఉంది. అయితే, తన పేరుని కృష్ణవేణిగా పోలీసుల వద్ద నమోదు చేయడంతో ఆమె విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.
ఆ రేవ్ పార్టీలో లేనట్లుగా హేమ మొదట పలు వీడియోలను చేసింది. తాను హైదరాబాదులోనే ఓ ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నానంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.ఆ తర్వాత మరో వీడియోను కూడా విడుదల చేశారు. అయితే, బెంగళూరు పోలీసులు తమ దగ్గర ఉన్న రికార్డ్స్ చెక్ చేసి హేమ తమ అదుపులో ఉందంటూ ఫోటోతో పాటు ఆమె వీడియో షూట్ చేసిన ప్రదేశానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టారు.

ఈ నేపథ్యంలో కేసు తప్పుదోవ పట్టిస్తోందంటూ హేమ మీద మరో కేసు నమోదు చేశారు. రెండు సార్లు విచారణకు గైర్హాజరైన హేమ కోసం బెంగళూరు నుంచి చెందిన సీసీబీ పోలీసులు సోమవారం హేమను విచారించారు. ఆ తర్వాత విచారణ కోసం బురఖా ధరించి వచ్చిన హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు మెడికల్ టెస్ట్ లు కూడా పూర్తి చేశారు.
సోమవారం సాయంత్రం అందిన సమాచారం మేరకు హేమకు జూన్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదయింది బెంగళూరులో కాబట్టి ఆమెను బెంగుళూరు జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, హేమకు నిర్వహించిన డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మరోవైపు, హేమతోపాటు డ్రగ్ సరఫరా చేసిన షరీఫ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications