ఆ పాత్రలో నటించివుంటే చరిత్ర తిరగరాసేవాడు!
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నవసరాలను పోషింగలిగే ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అన్నిరకాల పాత్రలను అవలీలగా పోషిస్తారు. అందులో లీనమైపోతారు. అటువంటి ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి చిత్రం కాంతార అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీనికోసం రిషభ్ చాలా కష్టపడ్డారు.
గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేసి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేసివుంటే సినిమా వేరే లెవల్ లో ఉండేదంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంకాదని చరిత్ర సృష్టించివుండేదని అభిమానులతోపాటు సినీ ప్రియులు కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.

రిషబ్ శెట్టి మెప్పించిన పాత్రలో ఎన్టీఆర్ కనిపించి ఉంటే అభిమానులు పూనకాలతో ఊగిపోయేవారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని వారు కూడా ఒప్పేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ తరహా పాత్రలు తనదగ్గరకు వస్తే వాటిని తిరస్కరించకుండా కచ్చితంగా సినిమా చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ దేవర చిత్రం చేస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. రెండు భాగాలు ఇది రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగం ఈ ఏడాది విజయ దశమికి విడుదల చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న అనిరుధ్ రవిచందర్ ఆలస్యంగా పనిచేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది. లేదంటే మే 5నే విడుదల కావాల్సి ఉంది. దీని ప్రభావం తారక్ తర్వాత చేస్తున్న సినిమాలపై కూడా పడింది. ఏ దర్శకుడితో ఏ చిత్రం చేయాలా అనే అయోమయంలో ఎన్టీఆర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications