ప్రశాంత్ నీల్ తర్వాత ఆ డైరెక్టర్ తోనే.. ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రాన్ని చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. జాన్వీకపూర్ కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని వార్2లో జాయిన్ అవుతాడు. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 31వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. దీనితర్వాత ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనే విషయం అభిమానుల మదిని తొలిచేస్తోంది.
తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. జవాన్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో తారక్ తన తర్వాత సినిమా చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత జూనియర్ నటించే చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ నీల్ తర్వాత అట్లీ దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి సంబంధించిన వర్క్ నడుస్తోంది.

అధికారికంగా వీరి కాంబినేషన్ లో సినిమాపై వార్త రానప్పటికీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోందంటున్నారు. అట్లీ చెప్పిన కథను విన్న తారక్ ఫిదా అయిపోయారని, వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. అట్లీ తొలి సినిమా రాజారాణి తరహాలో మెసేజ్ ఓరియెంటెడ్ గా ఇది తెరకెక్కబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాతో ఈ వార్త వైరల్ గా మారింది.
జవాన్ తో ఇండియాను షేక్ చేసిన అట్లీ దర్శకత్వంలో తమ హీరో సినిమా అని తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషీఖుషీగా ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమాతో సంచలన రికార్డులను నమోదు చేయడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం టాప్ రేంజ్ లో ఉంది.












Click it and Unblock the Notifications