పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వద్దంటే వారిద్దరూ సూపర్ స్టార్లు అయ్యారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రారంభించిన సినిమాలు మూడున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తిచేసి విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు. ప్రధానంగా రాజకీయాల్లో బిజీగా మారిపోయిన తర్వాత పవన్ నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే భిన్న కారణాల నేపథ్యంలో వెంటనే ఆయా సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే ఉద్దేశంలో పవన్ వెనకాడుతున్నారు.
రికార్డులు కొట్టాలన్న కసిలో కొరటాల
జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియాగా విడుదలైన రికార్డులు బద్దలు కొట్టాలన్న కసిలో దర్శకుడు కొరటాల శివ ఉన్నారు. దీంతోపాటు వార్2 చేస్తున్నారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ వద్దన్న సినిమాలు చేసినవారు స్టార్లుగా మారారు. ఆయా సినిమాలను వీరితోనే చేయాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ వారి కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో చేయడం కుదరలేదు. పూరీ జగన్నాథ్ ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు పవన్ తో చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో పూరీ వీటిని రవితేజతో చేశారు. ఆయన ఈ సినిమాలు చేసి స్టార్ హీరోగా మారారు.

స్టార్ హీరోలుగా మార్చిన సినిమాలు
జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన భద్ర కూడా రవితేజ చేశారు. అలాగే దిల్, సై సినిమాలు చేయాల్సినప్పటికీ ఖాళీ లేకపోవడంతో నితిన్ చేసి స్టార్ హీరోగా మారాడు. అలాగే పవన్ చేయాల్సిన అఅ సినిమా నితిన్ చేసి తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టారు. ఇలా వీరిద్దరూ వద్దనుకున్న సినిమాలు ఇతరులను స్టార్ హీరోలుగా మార్చాయి. అలాగే మరికొన్ని కారణాలతో కూడా వీరిద్దరూ కొన్ని సూపర్ హిట్ సినిమాలను చేయకపోవడంతో మరో ఇద్దరు హీరోలు వాటిని చేసి సూపర్ స్టార్లుగా మారిపోయారు.












Click it and Unblock the Notifications