నాలుగేళ్ల నుంచి సంచలనాలు సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమా కలెక్షన్లు రూ.500 కోట్లు దాటాయి. సినిమా రన్ ముగిసే సమయానికి రూ.600 కోట్లు రాబట్టవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తారక్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ జపాన్ లో ఆడుతుంది. అక్కడ కూడా భారీగా కలెక్షన్లను కొల్లగొట్టడంతోపాటు వీరిద్దరినీ రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి జపనీస్ వారు నాటకం ప్రదర్శిస్తే ముఖ్యఅతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు.

వారెవరూ ఇప్పుడు నోరు తెరవడంలేదు
ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై విజయవంతంగా ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా 2.5 బిలియన్ కలెక్షన్లు వసూలు చేసింది. జపాన్ లో 17 మిలియన్ల కలెక్షన్లు వచ్చాయి. హాలీవుడ్ సినిమాల్లో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమెర్ సినిమాకు 12 మిలియన్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

junior ntr and ramcharan movie rrr creating records from world wide four years

డెడ్ పూల్ సినిమాకు 14 మిలియన్ కలెక్షన్లు, దునే సినిమాకు నాలుగు మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాలేవీ ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను అధిగమించలేకపోయాయి. తెలుగులో ఎంతోమంది హాలీవుడ్ సినిమా అంత స్థాయి ఆర్ఆర్ఆర్ లో ఏముందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను చూసి వారు నోరు తెరవడంలేదు.

మూడున్నర సంవత్సరాల నుంచి సంచలనాలే
ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడున్నర సంవత్సరాల నుంచి సంచలనాలు సృష్టిస్తోందంటే అందుకు కారణం రాజమౌళి అని చెప్పొచ్చు. ఏ ఒక్క సన్నివేశంలో కూడా రాజీపడకుండా ఆడియన్స్ పల్స్ ను గట్టిగా పట్టుకొని సినిమాలను నిర్మిస్తూ ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ ను కూడా అందుకోలేదు. బాహుబలితో తెలుగు సినిమాను జాతీయస్థాయికి, ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లి పేరు ప్రఖ్యాతులను అందించాడు. త్వరలో మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా హాలీవుడ్ సినిమాలను కూడా తలదన్నే రీతిలో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+