రేవంత్ రెడ్డికి విరాళంతోపాటు ఊహించని గిఫ్ట్ అందించిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ స్వరాలందించిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలావుండగా ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలను వదరలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.
రెండు రాష్ట్రాలకు విరాళం
ఏపీలో బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం సగం మునిగిపోయింది. అలాగే తెలంగాణ పలు ప్రాంతాల్లో రైతులు పంటను కోల్పోవడంతోపాటు మున్నేరువల్ల ఖమ్మం మొత్తం నీటమునిగింది. ఈ రెండు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని జూనియర్ ప్రకటించారు. తారక్ తోపాటు సినీ హీరోలు పలువురు తమకు తోచినరీతిలో విరాళాలను రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు మరో బహుమతిని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో సినీ ప్రముఖులు డ్రగ్స్ కు సంబంధించిన ప్రకటన చేయాలని, అలా చేస్తే యువత మత్తుమందుకు దూరంగా ఉంటుందని పరిశ్రమ ప్రముఖులను కోరుతూ వచ్చారు.

Thank you #Devara movie Team,for your support in fight against drugs.@revanth_anumula @TelanganaDGP @director_tganb @TelanganaCMO @tarak9999 @TeamKoratala @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @narcoticsbureau @NMBA_MSJE @RachakondaCop #drugfreetelangana #SayNoToDrugs pic.twitter.com/AvNNxKCz7a
— Telangana Anti Narcotics Bureau (@TG_ANB) September 24, 2024
డ్రగ్స్ రహిత సమాజం కోసం
తాజాగా షూటింగ్ పూర్తికావడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ట్విటర్ ఖాతాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మత్తుమందుకు ఆకర్షితులై ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ రహిత తెలంగాణ రూపొందించేందుకు శ్రమిస్తున్న యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తాత్కాలిక ఆనందం కోసం, క్షణిక ఒత్తిడి కోసం మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావొద్దని, జీవితం ఎంతో విలువైందని, రండి.. నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దాం.. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవ్వండి.. రాష్ట్రంలో ఎవరు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నా, విక్రయిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు.












Click it and Unblock the Notifications