రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్... 12 ఏళ్ల రికార్డు బద్ధలు

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాన్ స్టాప్ గా కోటిరూపాయల వసూళ్లు మాత్రం కచ్చితంగా సాధిస్తోంది. సినిమా విడుదలై 21 రోజులవుతోంది. 19వ రోజు, 20వ రోజు కూడా కోటిరూపాయలు సాధించడం విశేషం. మూడువారాల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.130 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 20 రోజులకు సాధించిన కలెక్షన్లతోనే మరో రేర్ రికార్డును దేవర బద్దలు కొట్టడం విశేషం.

సీడెడ్ మాత్రం తమ అడ్డానే
మొదటి 20 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల్లో బాహుబలి2, అత్తారింటికి దారేది, బాహుబలి1, కల్కి, హనుమాన్ నిలవగా ఇప్పుడు వాటి సరసన దేవర సగర్వంగా నిలబడింది. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మొదటి 17 రోజులే నాన్ స్టాప్ గా కోటిరూపాయలు సాధించగా దేవర 19వ రోజు కూడా కోటిరూపాయలు రాబట్టి రికార్డు నెలకొల్పింది. సీడెడ్ లో మాత్రం తిరుగులేని కలెక్షన్లు రాబడుతూ అది నందమూరి హీరోల అడ్డా అని మరోసారి తారక్ నిరూపించాడు. ఓవర్సీస్ లో కూడా షేర్ రూ.38 కోట్లు వచ్చింది.

junior ntr devara beats 12 years record in telugu film industry

లాభాల బాటలో నడిపించేది..
బాలీవుడ్ లో, టాలీవుడ్ లో కూడా నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను లాభాలబాటలో నడిపించే కథానాయకులు ఇద్దరే అని, వారిద్దరూ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో తారక్ పాల్గొనాల్సి ఉంది. ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. విలనిజాన్ని అద్భుతంగా పండిస్తాడని తారక్ అభిమానులు ఆ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కేవలం దీన్ని ఒక భాగంగానే రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దేవర2 చేస్తాడు. దేవర1లో వచ్చిన లోపాలను సరిచేసుకుంటూ దేవర2ను అద్భుతంగా చిత్రీకరించనున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఈలోగా ఆయన ఒక సినిమాను మోహన్ లాల్ తనయుడితో చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+