'పుష్ప2' రికార్డును బద్ధలు కొట్టిన 'దేవర'
ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ దేవరపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది. తాజాగా అందిన సమాచారం మేరకు రెండు మిలియన్ డార్లను దాటేసింది. తాజాగా ఈ సినిమా బుక్ మై షోలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ యాప్ లో దేవర ఇంట్రస్ట్ పోల్ లో పాల్గొని అభిమానులంతా ఓటు వేస్తున్నారు. ఇప్పటివరకు దేవర సినిమా 3.5 లక్షల లైక్స్ ను సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. దీనికి ముందు స్థానంలో అల్లు అర్జున్ పుష్ప2 ఉండేది. ఆ చిత్రం 3.35 లక్షల లైక్స్ ను దక్కించుకుంది.
సినిమా విడుదల సమయంలో పెరుగుతుంది
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సిసినిమాకు బుక్ మై షోలో 50వేల ఆసక్తి వ్యక్తీకరణలు (ఇంట్రస్ట్) నమోదయ్యాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఓజీ సినిమాకు 84.5
వేల ఆసక్తి వ్యక్తీకరణలు, హరిహర వీరమల్లుకు లక్ష, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ చిత్రానికి 55వేల ఆసక్తి వ్యక్తీకరణలు నమోదయ్యాయి. సినిమా విడుదల సమయంలో ఈ ఇంట్రస్ట్ ల సంఖ్య పెరుగుతూ వస్తుంటుంది.

దేవిశ్రీప్రసాద్ ను తీసుకున్న బాగుండేది
దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించింది. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. అనిరుధ్ విషయంలో కొరటాల శివ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించేవారని, అతనితోనే సినిమా చేసినా బాగుండేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications