'దేవర' భీభత్సం... అంచనాలకు మించి జూనియర్ ఎన్టీఆర్ రచ్చ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తనకున్న మాస్ ఫాలోయింగ్, క్రేజ్ ద్వారా సినిమాను తారక్ బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాడు. 24 రోజుల్లోపే రూ.500 కోట్ల కలెక్షన్లను దాటేసింది. విజయదశమికి వచ్చిన సెలవులను ఈ సినిమా చక్కగా సద్వినియోగం చేసుకుంది. దేవర వరుసగా 19 రోజుల వరకు రోజుకు కోటిరూపాయల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. 24వ రోజు కూడా రచ్చ రచ్చ చేసింది. అంచనాలను మించిన కలెక్షన్లను సొంతం చేసుకొని సినీ విశ్లేషకులను, ట్రేడ్ పండితులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట
వరుసగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందించే పనిలోనే తారక్ ఉన్నాడు. దేవర కూడా డిస్ట్రిబ్యూటర్లను లాభాలబాటలోనే నడిపిస్తోంది. 24వ రోజు కూడా రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో కలెక్షన్లు రాబట్టింది. 24వ రోజుకు రూ.1.08 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1.3 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఆరోజు గ్రాస్ వసూళ్లు రూ.2.55 కోట్లు వచ్చాయి. దేవర ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లకు రూ.70 కోట్ల లాభాలనిచ్చింది. మరిన్ని లాభాలను పంచేదిశగా దూసుకుపోతోంది.

ఎవరివల్ల బ్లాక్ బస్టర్?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మొదటి భాగంలో జాన్వీకపూర్ పాత్ర పదినిముషాల్లోపునకే పరిమితమైంది. దీనిపై విమర్శలు వచ్చాయి. అయిదే దేవర2లో పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ మీద ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ వల్ల అయిందా? అంటే అందరూ తారక్ పేరు చెబుతున్నారు. దీంతో కొరటాల తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మోహన్ లాల్ కొడుకుతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయికానీ ఇంకా అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.












Click it and Unblock the Notifications